
ఈ ప్రపంచంలో నువ్వొకడివే మిగిలి చీకట్లు కమ్ముకున్న సాయంవేళ సముద్రం ఒడ్డున నిలబడితే కలిగే జలదరింపులాంటిది కలుగుతుంది, శివశంకర్ ‘చివరి పిచుక’ కథ చదివితే. అంతరిస్తోంది పిచ్చుక జాతి మాత్రమే కాదు మనిషి జీవితంలోని ఒక ముఖ్యమయిన పార్శ్వం కూడా అని అర్ధం అయినప్పుడు భవిష్యత్తు గురింఛి భయం వేస్తుంది.
కొందరికి తెలిసీ, ఎందరికో తెలియక జరుగుతున్న విధ్వంసకర అభివృధ్ధి మనిషిని సమస్త జీవజాలం నుండి, ప్రకృతినుండి విడదీసి ఒంటరిని చేస్తోంది.
ఈ వంటరి తనం విడిగా వ్యక్తులనూ ఆవరింఛింది. సమాజం ఒంటరి మనుషుల సమూహంగా మారిన నేపధ్యంలో వఛ్చిన శివశంకర్ కధల్లో చాలా వాటికి ఈ ఒంటరితనమే కధాంశం కావడం ఆశ్చర్యం కలిగించదు.
‘సగం తెరిఛిన తలుపు’, ‘ఒక్కవానకోసం’, ‘వర్చువల్ రియాలిటీ’, ‘జీవితం అంచున’, ‘మనుషులు వదులవుతారు’, ‘సముద్రం’ కధలు ఒంటరితనాన్ని దాని పర్యవసానంగా ఏర్పడిన వస్తుగత సంబంధాలను భిన్నకోణాలలో చర్చించాయి.
‘సగం తెరిఛిన తలుపు’ కధల్లో రామక్రిష్ణ సృజనాత్మక సాహిత్య రంగానికి అతిసమీపంగా ఉండికూడా ఒంటరితనానికి గురవుతాడు. దీనిని పోగొట్టుకునే ప్రయత్నంలో కన్న ఊరితో అయిన వారితో తెగిన బంధాలను ముడి వేసుకుంటూ పోతాడు. ‘ఒక్కవానకోసం’ కధలో హరికూడా తన కాలపు మనుషులతో బతకడంలో విఫలమై ఒంటరివాడై ఓదార్పునిచ్చే స్పర్శకోసం తాత ఊరికి వెళతాడు.
అసలు ఈ వంటరితనానికి మూలమెక్కడ. వ్యక్తిలోనా? వ్యక్తుల్ని ముడివేసే సంబంధాలలోనా? లేదా వాటిని నిర్ణయించే ఇంకా ఏవో శక్తుల్లోనా? దీనికి జవాబు ‘వర్చువల్ రియాలిటీ’ కధలో కనిపిస్తుంది. పనిలో నిమగ్నమయిన సుప్రియకైనా అంతగాకాలేని మనీషాకైనా ఒంటరితనం మిగలడానికి కారణం పని ఫలితం పరాయిదవ్వడమే. తనైపనిపై అధికారం లేని, దాని ఫలితంపై హక్కులేని స్థితే రామక్రిష్ణకి(సగం తెరిఛిన తలుపు) కూడా అసంతృఫ్తిని కలిగింఛింది. పనిపరాయీకరణ ఫలితమే మానవజీవితంలో ఒంటరితనం.
ఈ ఒంటరి తనం దయకర్ సుమతిలలాగా(జీవితం అంచున) మరణంవైపో రాధిక, హరిత(ఒక్కవానకోసం), చక్రపాణిలలాగా వస్తుగత సౌఖ్యం వైపో నెట్టేస్తోంది. పరాయితనం ఆవరించాక మనిషి మనిషికీ మధ్య ఉంటేది వొట్టి వస్తు సంబంధమే. వస్తువునుండి ఎవరైనా ప్రేమను ఆశించరు సుఖాన్ని తప్ప.
ఇంత స్ఫష్టంగా కాకపోయినా జ్ఞానానికున్న ఒంటరి కోణాన్ని పట్టి చూఫిన కధ ‘సముద్రం’. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయి ఒంటరివాడైన వనమాలికి పుస్తకాలు తోడవుతాయి. తనలో జ్ఞాన తృష్ణ రగిలిఫ్తాయి. పుస్తకాలు ఇఛ్చిన జ్ఞానంతోనే సమాజాన్ని తెలుసుకుంటాడు. పుస్తకాల్ని ప్రేమించాడు కనుకనే మనుషుల్ని ప్రేమించడమూ నేర్చుకుంటాడు. అనేక సమస్యలపై మాట్లాడతాడు, వ్యాసాలు రాఫ్తాడు. పర్యావరణ ఉద్యమాల్లో పాల్గంటాడు. ఛివరివరకూ పుస్తకాన్ని మాత్రం విడిఛిపెట్టడు. అయితే తన ఇద్దరి ఫిల్లలూ తన జ్ఞాన వారసత్వాన్ని అందుకో నిరాకరిఫ్తారు.అతని జ్ఞాన సంపదకి వారసత్వం లేకుండా పోతుంది. ఏ సముద్రాన్ని ఎక్కడ పారబొయ్యాలి అనే ప్రశ్నతో ప్రారంభమైన కథ ఆ ప్రశ్నతోనే ముగుస్తుంది. ఇక్కడ జ్ఞానాన్ని సముద్రంతో పోల్చడం సరైనదేనా? జ్ఞానం జీవనదిలా ప్రవహించేది. తాను ప్రవహించినంతమేరా పచ్చదనాన్ని మొలిఫించేది. వనమాలి పుస్తకాల ద్వారా పొందిన జ్ఞానం తన చుట్టూ మనుషుల్ని-కనీసం తనకుటుంబంలోని వారిని-చదవడానికి పనికి రాకపోవడానికి కారణం అతనిజ్ఞాన స్వభావంలోనే ఉంది. చుట్టూ ఉన్న సమాజంతోనూ, అందులోని బిన్న సమూహాలతౌనూ జరిగే ఘర్షణ వల్ల కలిగే జ్ఞానం(దీనికి పుస్తకాలు మరింత దోహదం చేయవచ్చు)తనకూ సమాజానికీ మేలుచేడ్తృఓంది. దీనికి ఒట్టి జ్ఞానతృష్ణ చాలదు. సమూహంతో సంభాషించగల ఓర్పు, కలసిపనిచేయగల ప్రజాస్వామిక స్ప్రుహ అవసరం. ఇవి లోఫించడం వల్లే తన సమీప సమూహమైన కటుంబసభ్యులతో మాటలు కరువవుతాయి. ఏ పుస్తకాలు చదవని వాళ్ళు సైతం నేర్పగలిగే కనీస మానవవిలువల్ని తాను తన పిల్లలకి నేర్పలేకపోతాడు( అసలు నేర్పాలనుకున్నాడా?). స్ర్తీల సమస్యల గురింఛి బయట ఎక్కడెక్కడో మాట్లాడిన వాడు తన భార్యకు వంటగదిని మాత్రమే మిగల్చ గలుగుతాడు. తాను ఫ్థాఫింఛిని సండ్థృ, పాల్గొన్న ఉద్యమాలు కూడా సమూహాల మీద కాక వ్యక్తి చైతన్యం మీద ఆధారపడినవి కావడం గమనించాలద్సిన అంశం.
వనమాలి పాత్రను ఉన్నతీకరించడంలో రచయిత తాధాత్మ్యం కనిఫిడ్తృఓంది. దానివల్ల ఆపాత్ర కున్న తాత్విక పరిమితులు రచయితవిగా కూడా భావించాల్సి ఉంటుంది. దీనికి కారణమైన సామాజిక స్థితికి సంబంధింఛిన లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది
ఇక మిగిలిన కధల విషయానికి వస్తే ‘ఛింతలతోపు కధ వ్యవసాయ రంగంలో ముఖ్యంగా గుంటూరు ప్రకాశం జిల్లాలలో వఛ్చిన మార్పుల్ని అధ్భుతంగా ఛిత్రింఛింది. వాణిజ్య పంటల జూదంలో ఓడిన రైతు కోల్పోయింది కేవలం ఛింతల తోపును కాదు. భూమితో తనకున్న సహజ సంబంధాన్ని. కామాక్షమ్మ తన జామచెట్టును(జామచెట్టూ) కాపాడుకున్నట్టూ వరదయ్య ఛింతలతోపును నిలుపుకోవడానికి వరదయ్యతో తలపడింది వట్టి మూఢనమ్మకం కాదు భూమిపై అప్పుడప్పుడే పట్టు భిగిస్తున్న పెట్టుబడి.
శివశంకర్ కధల్లో ఆలోఛింపచేసిన వాటితోపాటు నిరాశ పరఛినవీ ఉన్నాయి. ‘సుశీల’ కధ తీసుకుంటే తెలుగు సాహిత్యంలో ఇది నలిగిపోయిన వస్తువు. నేటితెలుగు సమాజం కధలో నరేంద్ర చూపిన చైతన్య ఫ్థాయిని దాటి చాలా ముందుకు పోయింది. శీలం, పవిత్రత స్ర్తీల శరీరాలకు సంబంధింఛినవి మాత్రమే కాదనే అంశంతో చాలా కధలు, కొన్ని సినిమాలూ వచ్చాయి.
‘అపరాధి’ కథాంశం మానవీయమయినదీ మనిషిలోపలి మనిషిని తట్టిలేపేదే అయినా ఇలాంటి కధలు ఇప్పటికే చాలా చదివి ఉండడం వల్ల కలగాల్సిన స్పందన కలగదు.
‘అసతోమా..’ విద్యారంగంలో వఛ్చిన మార్పుల్ని ముఖ్యం లక్ష్యంలేని చదువుని, బాధ్యతలేని ఉపాధ్యాయుల్ని చక్కగా ఛిత్రింఛింది. అయితే ముగింపులో పరివర్తన వల్ల కొంత నాటకీయత వఛ్చింది.
విద్యారంగం కధావస్తువుగా రాసిన మరో కధ ‘బళ్ళూ ఓడలు’ పేరులోనే ధృక్పద లోపం కనిఫిస్తుంది. ఆషాలాంటి అమ్మాయిలు, మైనారితీలు ఇతర వెనుకబడిన వర్గాల నుంఛి పెద్ద ఎత్తున ఆహ్వానించదగ్గ పరిణామమే. దానికి సామాజిక సౌభాగ్యంలో వాటాకోసం ఆయావర్గాలు పడుతున్న తపన పాక్షిక కారణమే ఇప్పటి వరకూ ఆయా స్తానాల్లో ఉన్న పాత కొత్త అగ్రవర్ణాలు ఇప్పుడు మరిన్ని కొత్త అవకాశాలకోసం, సంపదనిచ్చే విద్యకోసం కార్పోరేట్ సంస్తల్లోకి వెళ్ళగా వఛ్చిన ఖాళీలోకి వెనుకబడిన వర్గాలు రావడం సులభం అయ్యిందన్నాది అసలు వాస్తవం. ఒక రకంగా చెప్తే గ్రామీణ ప్రభుత్వ కళాశాలల్లో చదువు,కీ అందులోనూ సామాజిక శాస్త్రాలకి మార్కెట్ లేనందువల్లే సంపన్న అగ్రవర్ణాలు ఆయా సంస్తల్ని వదిలి వేశాయి. అందువల్లనే అక్కడ ఎక్కడికీ వెళ్ళలేని పేద దళిత విద్యార్డులు ఎక్కువ మంది కనిఫిస్తున్నారు. దీనిని బళ్ళు ఓడలు కావడంగా అర్ధం చేసుకోవడం పూర్తిగా అవగాహన రాహిత్యం.
ఈ సంకలనంలోని మూడు వ్యంగ్య కధలను గురింఛి ప్రత్యేకంగా చెప్పకోవాలి. ముఖ్యంగా ‘ఇహపరాల మధ్య’ కధలో వ్యంగ్యం అద్భుతంగా కుదిరింది. చాల స్పష్టత వుంటేనేగానీ అట్లారాయడం సాధ్యంకాదు. ‘ఒయ్యారి భామ’ కూడా కొంత సీరియస్ సెటైర్తో చెప్పల్సింది సూటిగానే చెఫ్పింది. ‘డాలర్ మోహము…’ కధమొత్తంమీద బాగున్నా శైలిలో ఏకరూపత లోఫింఛినట్టు అనిఫింఛింది. మధ్యలో గ్రాంధికం వాడడం ఒక శైలి అనుకున్నా ఎందుకో అది నప్పినట్లు లేదు.
ఏదేమైనా ఒక ప్రసిధ్ధ రచయిత గురింఛి కొన్ని అంచనాలు ఉంటాయి. అతని రచనలు పరిశీలించేటప్పుడు ఆ అంచనాలు తప్పకుండా ప్రభావం చూఫిఫ్తాయి. అలాగే రచనాకాలాలు బిన్నమైనా వాటన్నిటినీ వ్యాఖ్యానించడంలో వార్తమాన చైతన్యం పాత్ర ఖఛ్చితంగా ఉంటుంది. ఈ పరిమితులన్నిటి మధ్య శివశంకర్ సగం తైరఛిన తలుపు సంకలనంలోని కధలు కొంత సంతృఫ్తినీ కొంత నిరాశనీ మిగిల్చాయని చెప్పక తప్పదు
-కరుణాకర్